విద్యార్థుల భవిషత్తును తీర్చి దిద్దేది ఉపాధ్యాయులే: బీర్ల అయిలయ్య

కలం యాదగిరిగుట్ట: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (Beerla Ilaiah) అన్నారు.  భువనగిరి పట్టణంలో యాదాద్రి భువనగిరి జిల్లా ట్రాస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. సరస్వతి దేవి విగ్రహానికి పూలమాల వేసి, జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి, వారి సేవలను అభినందించారు.

ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించడంతో పాటు, వారిలో క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యత, దేశభక్తి వంటి గుణాలను పెంపొందించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఒక విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు అందించే జ్ఞానం, మార్గదర్శనం విద్యార్థుల జీవితాలను ఉన్నత శిఖరాలకు చేర్చుతుందని అన్నారు.

సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న అనేక మంది వ్యక్తుల విజయాల వెనుక ఉపాధ్యాయుల కృషి దాగి ఉంటుందని బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక విద్యా విధానాలను అందిపుచ్చుకుని బోధనలో నూతన పద్ధతులను అనుసరించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను, ప్రశ్నించే తత్వాన్ని, నైపుణ్యాలను పెంపొందించేలా బోధన సాగాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య, విద్యార్థులు, ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని బీర్ల అయిలయ్య చెప్పారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు చేస్తున్న సేవలను సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు.

ఈ సందర్భంగా గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ సమాజ అభివృద్ధికి మరింతగా సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రాస్మా జిల్లా ప్రతినిధులు, విద్యాసంస్థల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>