గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. పోలీసులపై ఎస్పీ ప్రశంసలు!

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లాలో గణేష్ నిమజ్జనోత్సవ వేడుకలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) ఆదివారం తెలిపారు. నిమజ్జన శోభాయాత్రలు జరిగే మార్గాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ ప్రాంతాల పర్యవేక్షణ, విగ్రహాల నిమజ్జన ప్రక్రియపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు.

పోలీస్ ఉన్నతాధికారులు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, ఇతర సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించడంతో నిమజ్జనోత్సవాలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజలు, వివిధ శాఖల అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. 36 గంటల పాటు నిర్విరామంగా విధులు నిర్వహిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు నిర్వహించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>