కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు కృషి చేయాలి: మంత్రి అడ్లూరి

కలం, రాజన్నసిరిసిల్ల: తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమ యోధుడు, సామాజిక సమతావాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) పిలుపునిచ్చారు.

ఆదివారం రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లా కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డిలతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళు లర్పించారు.​

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పదవుల కంటే ప్రత్యేక తెలంగాణ సాధనే ధ్యేయంగా బాపూజీ పనిచేశారని, మలిదశ ఉద్యమంలో తన నివాసాన్నే ఉద్యమ కార్యాలయంగా మార్చిన మహనీయుడని కొనియాడారు. గాంధీజీలాగే తెలంగాణ ప్రజల గుండెల్లో ‘బాపూజీ’గా నిలిచారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.

సిరిసిల్లలోని చేనేత, పద్మశాలి కుటుంబాలతో పాటు అన్ని బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ​అన్యాయాలపై ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకుని, సమసమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>