ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు ఊరట!

కలం, వెబ్ డెస్క్ : దేశంలోని ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ద్వారా ‘టెలికాం వినియోగదారుల రక్షణ (పదమూడవ సవరణ) నిబంధనలు, 2026’ను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నూతన నిబంధనల (Prepaid Recharge Rules) ప్రకారం ఇకపై ప్రతి నెలా రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు పూర్తి 30 రోజుల కాలపరిమితి కలిగిన రీఛార్జ్ (30 Day Recharge) ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకూ 28 రోజుల చెల్లుబాటుతో ఏడాదికి 13 సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సి రాగా, కొత్త విధానంతో ఏడాదికి 12 రీఛార్జ్‌లు సరిపోతాయని రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు.

ఈ నూతన నిబంధనల్లో (Prepaid Recharge Rules) డేటా అవసరం లేని వారికి కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు మాత్రమే పొందే చౌకైన ప్లాన్లను కూడా ప్రవేశపెట్టారు. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో ప్రాథమిక కాల్స్ వినియోగించే వినియోగదారులకు ఇవి ఎంతగానో ప్రయోజనకరంగా మారనున్నాయి. సాధారణ వినియోగదారుల ప్రయోజనాలను, రీఛార్జ్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ సానుకూల నిర్ణయం తీసుకున్నందుకు గాను భారత ప్రభుత్వం, ట్రాయ్‌కు రాఘవ్ చద్దా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Also Read : ఆసియా క్రీడలు: ఫెన్సింగ్‌లో ముగిసిన భారత్ ప్రయాణం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>