కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఆసియా క్రీడల్లో పురుషుల బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకం సాధించిన తెలంగాణ క్రీడాకారుడు తరుణ్ మానేపల్లి (Tarun Manepalli) ని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari) ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఆదివారం మంత్రి క్యాంపు కార్యాలయం లో తరుణ్, మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు.
అంతర్జాతీయ వేదికపై ప్రతిభ చాటి పతకం సాధించడం గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. తరుణ్ మానేపల్లి విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తి అని అభివర్ణించారు. క్రీడల్లో ప్రతిభ ఉన్న యువతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని తెలిపారు.
తెలంగాణలో క్రీడలకు మరింత ప్రాధాన్యం కల్పిస్తూ మౌలిక వసతులు, శిక్షణ సదుపాయాలను బలోపేతం చేస్తున్నామని మంత్రి శ్రీహరి పేర్కొన్నారు. భవిష్యత్తులో తరుణ్ మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

