కలం, నిర్మల్: స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ పోరాటయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ (Konda Laxman Bapuji) 111వ జయంతిని నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయ సమీపంలో గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్, కుల సంఘ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు.
తెలంగాణ తొలి దశ ఉద్యమంలో బాపూజీ అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని వదులుకున్న తొలివ్యక్తిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్, పద్మశాలి కుల సంఘ నాయకులు పాల్గొన్నారు.
బాసరలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో..
బాసర (Basara) మండల కేంద్రంలో పద్మశాలి సంఘ భవనంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ తీగల వెంకటేష్ గౌడ్, సంఘ అధ్యక్షుడు ఓని స్వామి బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలంగాణ తొలి ఉద్యమంలో బాపూజీ కీలక పాత్ర పోషించారని, తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉద్యమానికి అంకితమయ్యారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కొక్కుల గంగాధర్, గెంటిల శ్యాంసుందర్, ఎమ్మెవార్ విజయ్, మేకల అశోక్, అంకం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

