కలం, స్పోర్ట్స్: ఆసియా క్రీడల (Asian Games) బాక్సింగ్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. కామన్వెల్త్ ఛాంపియన్ అంకుష్ పంగాల్ (Ankush Panghal) పురుషుల 80 కేజీల విభాగంలో సెమీఫైనల్ చేరారు. ఆదివారం నిషియో జిమ్నాషియంలో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆయన తజికిస్తాన్ బాక్సర్ నెక్రుజ్ సలీమోవ్‌ను 5-0తో ఓడించారు.
ఈ రింగ్ పోరులో అంకుష్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. తొలి రౌండ్ నుంచే వేగంగా దాడి చేస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. మొదటి రెండు రౌండ్లను 5-0తో గెలుచుకుని విజయాన్ని సుగమం చేసుకున్నారు. చివరి రౌండ్‌ను సలీమోవ్ సాధించినా, అంకుష్ (Ankush Panghal)పాయింట్ల ఆధిక్యంతో విజేతగా నిలిచారు.
మరోవైపు ఇతర విభాగాల్లో భారత క్రీడాకారులకు నిరాశే ఎదురైంది. కురాష్ క్రీడల్లో విశాల్, సంగీత బల్హారా, భారతి, యశ్ కుమార్ చౌహాన్ ముందస్తు రౌండ్లలోనే ఓటమి పాలయ్యారు. అథ్లెటిక్స్ డెకాథ్లాన్‌లో తేజస్విన్ శంకర్ ఏడు ఈవెంట్లు ముగిసేసరికి మూడో స్థానానికి పడిపోయారు. రాబోయే రౌండ్లలో భారత అథ్లెట్లు మళ్లీ పుంజుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు.
Also Read : పరిమితి దాటిన AI ఏజెంట్లు.. ఓపెన్ AI సంచలన నిర్ణయం
Follow Us On: X(Twitter)

