కలం, స్పోర్ట్స్: ఇండియాతో 1-1 డ్రా తర్వాత పనామా (Panama)కోచ్ థామస్ క్రిస్టియన్సెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో ట్రాఫిక్( Bengaluru Traffic), ప్రయాణ ఏర్పాట్లు తమ జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపాయని తెలిపారు. మ్యాచ్కు ముందు స్టేడియానికి చేరుకోవడానికి దాదాపు రెండు గంటలు బస్సులో ప్రయాణించాల్సి వచ్చిందని చెప్పారు.
దీంతో ఆటగాళ్లకు సరైన సిద్ధతకు ఇబ్బందులు ఎదురయ్యాయని వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఏర్పాట్ల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని పేర్కొన్నారు. మరోవైపు పనామా (Panama) జట్టు పునర్నిర్మాణ దశలో ఉందని క్రిస్టియన్సెన్ తెలిపారు. ఈ మ్యాచ్లో ఐదుగురు ఆటగాళ్లు తొలిసారి తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.
ప్రయాణం, పరిమిత శిక్షణ కారణంగా కొత్త ఆటగాళ్లతో సమన్వయం చేసుకునే సమయం తక్కువగా ఉందన్నారు. దీంతో తొలి భాగంలో పనామా ఆటలో సమన్వయం లోపించింది. ఆటగాళ్ల మధ్య ఎక్కువ దూరం ఉండటంతో భారత్కు దాడులు చేసే అవకాశం లభించిందని క్రిస్టియన్సెన్ వివరించారు. భారత ఆటగాళ్లకు ఖాళీ, సమయం ఇస్తే ప్రమాదకరంగా మారగలరని ఆయన పేర్కొన్నారు.
Also Read : లవ్లీ యూనివర్సిటీలో అర్ధరాత్రి రచ్చ రచ్చ.. అసలు ఏం జరిగిందంటే?
Follow Us On: X(Twitter)

