కాపురానికి పంపలేదని కక్ష.. మామపై గొడ్డలితో దాడి!

కలం, ఖమ్మం బ్యూరో: ​భార్యను కాపురానికి పంపేందుకు నిరాకరిస్తున్నాడనే కక్షతో మామపై అల్లుడు గొడ్డలితో దారుణానికి ఒడిగట్టిన సంఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో కలకలం రేపింది. ​లచ్చగూడెం (Lachagudem) గ్రామానికి చెందిన షేక్ ఉద్దండు సాహెబ్ తన కూతురిని మేనల్లుడైన షేక్ మీరాసాహెబ్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. కొద్ది రోజులుగా దంపతుల నడుమ విభేదాలు తలెత్తడంతో ఆమె పుట్టింటికి వచ్చింది. ​

కాపురానికి రావాల్సిందిగా మీరాసాహెబ్ కోరినా, ఆమె తండ్రి సాహెబ్ మాత్రం కూతురిని పంపేందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన మీరాసాహెబ్, శనివారం భార్య పుట్టింటికి వెళ్లాడు. మామతో ఘర్షణకు దిగి, వెంట తెచ్చుకున్న గొడ్డలితో ఉద్దండు సాహెబ్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఉద్దండు సాహెబ్‌ను కుటుంబ సభ్యులు వెంటనే ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>