కలం, ఖమ్మం బ్యూరో : భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది ప్రవాహం ప్రస్తుతం ప్రమాద స్థాయి కంటే చాలా దిగువన ప్రశాంతంగా కొనసాగుతోంది. శనివారం సాయంత్రం 6 గంటలకు అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం, నదిలో నీటిమట్టం 28.60 అడుగులుగా నమోదైంది. ఈ సమయంలో గోదావరి నుంచి 3,94,633 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తుండటంతో స్థానిక ప్రజలు, అధికారులు నిశితంగా గమనిస్తున్నారు.
నదిలో వరద తీవ్రత ఆధారంగా అధికారులు ముందస్తు హెచ్చరిక స్థాయిలను నిర్దేశించారు. నీటిమట్టం 43 అడుగులకు చేరి, ప్రవాహం 9,32,288 క్యూసెక్కులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. కాగా రేపటి వరకు నీటి మట్టం 35 అడుగులకు చేరి, తదుపరి తగ్గుముఖం పడుతుందనీ అధికారులు అంచనా వేస్తున్నారు.

