ఏఐతో ప్రాణాలు పోతాయ్!.. బిల్ గేట్స్ ఆందోళన

కలం, వెబ్ డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా మానవులకే ముప్పు రావొచ్చని ఇటీవల కాలంలో పలువురు టెక్ దిగ్గజాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) కూడా బాంబ్ పేల్చారు. ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం చేస్తే కనీసం 100 కోట్ల మంది చనిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. చెడు వ్యక్తుల చేతుల్లోకి ఏఐ వెళితే అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్నారు.

ఏఐకి భారీ స్థాయిలో ప్రాణ నష్టం కలిగించే సామర్థ్యం కూడా ఉండొచ్చని.. అందుకే దాని కారణంగా వచ్చే ముప్పులను ఇప్పటి నుంచే సీరియస్‌గా తీసుకోవాలని బిల్ గేట్స్ అన్ని దేశాలకు సూచించారు. ఏఐ రంగంలో వస్తున్న అనూహ్య మార్పులు అత్యంత ఆందోళనకరమని కూడా స్పష్టం చేశారు. బిల్ గేట్స్ వ్యాఖ్యలు ఇప్పుడు టెక్ ప్రపంచంలో సంచలనంగా మారాయి.

గతంలో కూడా ఇలాగే..

ఏఐ టెక్నాలజీ కారణంగా ఎంత ఉపయోగం ఉందో.. అంతకుమించిన నష్టాలున్నాయని కొంతకాలంగా టెక్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంత్రోపిక్ సంస్థకు చెందిన పరిశోధకులు ఇవాన్ హుబింగర్, జాకబ్ కాక్సన్ సైతం ఏఐ ముప్పు ఊహించని స్థాయిలో ఉంటుందన్నారు. ఏఐ వ్యవస్థల భద్రతలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వారు.. జరగబోయే పరిణామాలను ఊహించలేమన్నారు. ఏఐ మోడళ్ల అభివృద్ధిని తగించాలని మాత్రం అందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు. ఇంత వేగాన్ని ప్రస్తుతం సమాజాలు తట్టుకోలేనివని.. దీని వలన అనూహ్య మార్పులు సంభవిస్తాయని కూడా చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>