కస్బా పాఠశాల భవనాన్ని బీసీ హాస్టల్‌గా మార్చాలి: కలెక్టర్ భవేష్ మిశ్రా

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని కస్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాల (Kasba Govt High School) భవనాన్ని బీసీ బాలుర సంక్షేమ వసతి గృహంగా వినియోగించేందుకు అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు.

శనివారం సాయంత్రం పాఠశాల భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఖాళీగా ఉన్న భవంతిని బీసీ విద్యార్థుల వసతి గృహంగా మార్చి, వీలైనంత త్వరగా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. భవంతిలో అవసరమైన మార్పులు, మరమ్మతులు చేపట్టి, విద్యార్థులకు అనుకూలమైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

వసతి గృహం పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని, విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వసతి గృహం అందుబాటులోకి వస్తే బీసీ విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.

కలెక్టర్ వెంట డీఈవో భోజన్న, బీసీ, మైనార్టీ సంక్షేమ అధికారులు శ్రీనివాస్, దయానంద్, సహాయ బీసీ సంక్షేమ అధికారి సత్యనారాయణ, తహశీల్దార్ రాజు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>