కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలి: సీఐటీయూ

కలం, నిర్మల్: కార్మికులకు కనీస వేతనం అమలు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ (CITU) జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ డిమాండ్ చేశారు. శనివారం నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు పి. గంగామణి అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు.

మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు, ఆశా, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ, మున్సిపల్ తదితర కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని కోరారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేసి సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 25, 26 తేదీల్లో ఛలో హైదరాబాద్, డిసెంబర్ 1 నుంచి 3 వరకు చలో ఢిల్లీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా నాయకులు సుజాత, గంగాధర్, లలిత, మల్లేష్, చంద్రకళ, లావణ్య, రాజశేఖర్, క్లెమెంట్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>