కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర రెండో రోజు ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా బుధవార్‌పేట్ (Budhwarpet) నంబర్ వన్ గణపతి నిమజ్జన (Ganesh Immersion) శోభాయాత్ర శుక్రవారం ప్రారంభమైంది. పట్టణ పురవీధుల గుండా భక్తుల సందడి మధ్య బొజ్జ గణపయ్యను ఊరేగిస్తూ వినాయక్‌సాగర్ చెరువులో నిమజ్జనం చేసి ఘనంగా వీడ్కోలు పలికారు.
గణపతి బొప్పా మోరియా అంటూ భక్తులు చేసిన నినాదాలతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి. గణపతి నిమజ్జనాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో వినాయక్‌సాగర్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

