మెదక్‌‌లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ప్రారంభించిన మంత్రి వివేక్

కలం, మెదక్ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికరమైన అల్పాహారం అందించడమే సీఎం అల్పాహారం పథకం (CM Breakfast Scheme) ముఖ్య ఉద్దేశమని, విద్యార్థులకు కోసం తెచ్చిన అత్యంత అరుదైన స్కీమ్ అని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మెదక్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో నూతనంగా నిర్మించిన కేంద్రీకృత కిచెన్ ను మంత్రి వివేక్ వెంకటస్వామి, శాసన సభ్యులు మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి అల్పాహారం పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. పాఠశాలలకు మార్నింగ్ 8:30 కి టిఫిన్ వస్తుందని, రాష్ట్రవ్యాప్తంగా 36 కిచన్ లు ఏర్పాటు చేయడం జరిగిందని, ముఖ్యమంత్రి అల్పాహార పథకం ద్వారా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. తెలంగాణలో 12 తరగతి విద్యార్థుల వరకు అల్పాహార పథకాన్ని అందిస్తామన్నారు. అల్పాహార పథకం రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మంది విద్యార్థులకు ఇస్తున్నామని, టెక్నాలజీ కోసం నూతనంగా ఏటీసీ సెంటర్ ప్రారంభించామని, అందులో శిక్షణ పొందిన వారికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ (హెచ్‌కెఎంసిఎఫ్) అధ్యక్షుడు, అక్షయ పాత్ర ఫౌండేషన్ (టిజి & ఆంధ్రప్రదేశ్) ప్రాంతీయ అధ్యక్షుడు హిస్ గ్రేస్ శ్రీ సత్య గౌర చంద్ర దాస మాట్లాడుతూ… మెదక్ జిల్లాలో 30 వేల మంది విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ బృహత్తర కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో 20% విద్యార్థులు అదనంగా చేరుతున్నారన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>