కలం, పెంబి: పెంబి (Pembi) మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో విద్యుత్ షాక్ కారణంగా మొక్కజొన్న పంట నష్టపోయిన బాధిత రైతులకు ప్రభుత్వం అందిస్తున్న నష్టపరిహారం చెక్కులను ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bhojju Patel) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోస్కుల శ్రీనుకు రూ.1.08 లక్షలు, గోస్కుల తిరుమలకు రూ.1.44 లక్షలు, కొప్పుల జ్యోతికి రూ.1.44 లక్షలు, ఎలిగేటి అనిల్ కుమార్కు రూ.2.16 లక్షలు, ఒడ్నాల ఉమకు రూ.1.44 లక్షల చొప్పున పరిహారం చెక్కులను అందజేశారు.
అనంతరం అర్హులైన లబ్ధిదారులకు నూతన డిజిటల్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రైతులు, పేదలు, సామాన్య ప్రజలకు అండగా నిలుస్తోందన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని చర్యలు చేపడుతోందని తెలిపారు. నూతన డిజిటల్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందుతాయని పేర్కొన్నారు.
Also Read : ఆ సినిమాకు వెళ్లబోతున్న కేటీఆర్.. పోస్ట్ వైరల్!
Follow Us On : WhatsApp

