భూమి కోసం.. భుక్తి కోసం పోరాడిన వీరనారి ఐలమ్మ: ఎమ్మెల్యే సంజయ్ కుమార్

కలం, జగిత్యాల: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్బంగా జగిత్యాల (Jagtial) పట్ణంలోని చింతకుంట వద్ద మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్‌తో కలిసి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గజంగి నందయ్య, కమిషనర్ సత్య ప్రణవ్, AMC చైర్మెన్ గడ్డం నారాయణ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు గట్టు సతీష్, కౌన్సిలర్లు పంబాల సుజాత రాము, బొల్లరపు స్వప్న గిరీదర్, బడుగు పద్మ రాజేందర్, గట్టపల్లి మానస జ్ఞానేశ్వర్, సిరిపురం శ్రీలత శ్రీనివాస్, షాహిన్ బేగం అఫ్రోజ్, దుమాల రాజ్ కుమార్, పిట్ట ధర్మరాజు, చీటి లక్ష్మీ నారాయణ, ఆయుబ్ ఖాన్, కూతురు శేఖర్, TPCC సెక్రటరీ బండ శంకర్, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ AMC చైర్మెన్ నక్కల రవీందర్ రెడ్డి, దామోదర్ రావు, రజక సంఘం అధ్యక్షులు పోషాలు, కార్యదర్శి లక్ష్మీ నారాయణ, ఉప అధ్యక్షులు పెద్దింటి లక్ష్మణ్, కోశాధికారి లక్ష్మీ నారాయణ, నాయకులు పెద్దింటి రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>