చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శం: సంజీవ్ ముదిరాజ్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: చాకలి ఐలమ్మ (Chakali Ilamma) పోరాట పటిమ నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ కొనియాడారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మహబూబ్‌నగర్ (Mahabubnagar) పట్టణంలోని పద్మావతి కాలనీ గ్రీన్‌బెల్ట్‌లో ఏర్పాటు చేసిన విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎ. సంజీవ్ ముదిరాజ్ (Sanjeev Mudiraj) శనివారం పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, సమానత్వం కోసం ధైర్యంగా పోరాడిన మహోన్నత మహిళ చాకలి ఐలమ్మ అన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని, ఆమె పోరాట స్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.

సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం చాకలి ఐలమ్మ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఆమె ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజంలోని అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు బెక్కరి మధుసూదన్ రెడ్డి, డీసీసీ జనరల్ సెక్రటరీ ఎం.ఏ. కలీం, డీసీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మజార్ ఖాన్, నాయకులు బురెమోని చందు యాదవ్, నియాజ్ తదితరులు, అలాగే రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>