డీజేకు పర్మిషన్ ఇవ్వలేదని వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు..

కలం, వెబ్ డెస్క్ : వినాయక నిమజ్జన వేడుకల్లో హైడ్రామా చోటు చేసుకుంది. కామారెడ్డి (Kamareddy) జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేటలో నిమజ్జన శోభాయాత్రలో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. నిమజ్జన ఊరేగింపులో (Ganesh Immersion) డీజేకు అనుమతి ఇవ్వలేదని ఆ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. దీంతో స్థానికంగా ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువకుడికి నచ్చజెప్పి అతడిని సురక్షితంగా కిందకు దించారు. అనంతరం యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. దీంతో అక్కడ పరిస్థితి సద్దు మణిగింది.

కాగా, నిమజనోత్సవంలో డీజేలకు అనుమతి లేదని పోలీసులు ముందుగానే హెచ్చరించిన విషయం తెలిసిందే. అయినా ఆంక్షలేవీ లెక్క చేయకుండా కమిటీలు సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకున్నారు. దీంతో చాలా ప్రాంతాల్లో పోలీసులకు, మండప నిర్వాహకుల మధ్య వాగ్వాదం చోటుకుచేసుకుంది. ఆదిలాబాద్ లో శోభాయాత్రకు బ్యాండ్, డీజేలకు అనుమతివ్వక పోవడంతో రోడ్లపైనే వినాయక విగ్రహాలను నిలిపి కమిటీ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు. సౌండ్ లేకుండా నిమజ్జనం చేసే ప్రసక్తే లేదని రోడ్డుపైనే బైటాయించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>