పోలీస్ స్టేషన్‌లోనే దాడులు.. కొత్తగూడెంలో కలకలం

​కలం, ఖమ్మం బ్యూరో: శాంతిభద్రతలను పరిరక్షించే పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే రెండు వర్గాలు దాడులకు దిగడం, వారించబోయిన పోలీసులనే నెట్టేయడం వంటి ఘటన కొత్తగూడెం (Kothagudem) పట్టణంలో కలకలం రేపింది. ఒకవైపు సిబ్బంది గణేష్ నిమజ్జన బందోబస్తు విధుల్లో నిమగ్నమై ఉంటే.. రెండు వర్గాలు గొడవకు దిగడంతో మూడో టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గందరగోళం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ​స్థానికంగా నివాసం ఉండే కొరదల కుమార్, ఆయన భార్య వినోద మధ్య కొంతకాలంగా కుటుంబ వివాదం నడుస్తోంది. దీనికి గురించి పోలీసుల సమక్షంలోనే తేల్చుకోవాలని రెండు వర్గాలు మూడో టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ క్రమంలో మాటామాట పెరిగి ప్రత్యక్ష దాడులకు దిగారు. ఈ క్రమంలో దున్నపోతుల రాజు అనే వ్యక్తిపై కొందరు దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంకటమల్లు అనే మహిళను కొందరు కొట్టారని చెబుతున్నారు.

కేసులు నమోదు.. రిమాండ్

​స్టేషన్ ప్రాంగణంలో జరుగుతున్న గొడవను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. వారినే ఇరువర్గాల వారు తోసివేశారు. దీంతో తీవ్రంగా స్పందించిన పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి, దాడికి పాల్పడిన వ్యక్తులను తక్షణమే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకోవడం వంటి చర్యలను ఎంతమాత్రం సహించేది లేదని కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ హెచ్చరించారు. అనంతరం నలుగురు నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>