మత సామరస్యంతోనే దేశ అభివృద్ధి: గంగుల కమలాకర్

కలం, కరీంనగర్: మత సామరస్యంతో హిందూ, ముస్లిం, సిక్కు తదితర అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి జీవించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మించిన మాసాన్ని పురస్కరించుకుని జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో కరీంనగర్ మహాత్మా జ్యోతిబా పూలే మైదానంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను (Religious Harmony Exhibition) నగర బీఆర్‌ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ఎమ్మెల్యే పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు రూపొందించిన నమూనాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందించేందుకు ఆర్థిక సహాయం చేయాలని నిర్వాహకులు కోరగా.. గంగుల కమలాకర్ వెంటనే స్పందించి రూ.60 వేల ఆర్థిక సాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్నేహభావంతో, పరస్పర గౌరవంతో కలిసిమెలిసి జీవించాలని సూచించారు. సమాజంలో మత సామరస్యం, సోదరభావం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, కార్పొరేటర్లు యూసుఫ్, అలీ, నాయకులు గాదె శ్రీనివాస్, జమాతే ఇస్లామీ హింద్ ప్రతినిధులు, విద్యార్థులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>