కలం, నకిరేకల్: తెలంగాణ రజక ఫెడరేషన్ (Telangana Rajaka Federation) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 26న రాష్ట్ర ప్రభుత్వం వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించబోతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ కన్వీనర్‌గా నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన పగిళ్ల సందీప్ (Pagilla Sandeep) ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా పగిళ్ల సందీప్ మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన వీరోచిత పోరాటం నేటి ప్రజా ఉద్యమాలకు చిరస్థాయి స్ఫూర్తి అని కొనియాడారు. తన ఎంపికకు సహకరించిన తెలంగాణ రజక ఫెడరేషన్ ఛైర్మన్ దాసరాజు అజయ్ కుమార్, కొన్నే సంపత్, కులుకులపల్లి రాధికకు సందీప్ కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: గోదావరిలో వరద ఉన్నా ఖాళీగా రిజర్వాయర్లు: హరీశ్ రావు
Follow Us On: X(Twitter)

