కలం, సూర్యాపేట: చివ్వెంల (Chivvemla) మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల విద్యార్థులు సూర్యాపేట జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 20న జిల్లా కేంద్రంలో సూర్యాపేట జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో అండర్-18 విభాగంలో విద్యార్థులు సత్తా చాటారు. 1000 మీటర్ల పరుగు పందెంలో బి. హరిదీప్, 100 మీటర్ల పరుగు పందెంలో పి.సంజయ్ మొదటి స్థానాల్లో నిలిచారు.
వీరిద్దరూ ఈ నెల 26, 27వ తేదీలలో హనుమకొండలో జరగనున్న 12వ తెలంగాణ స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలకు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా హరిదీప్, సంజయ్‌ను చివ్వెంల గురుకుల పాఠశాల (Chivvemla Gurukul School) ప్రిన్సిపల్ జి.వి.విద్యాసాగర్, ఫిజికల్ డైరెక్టర్ కృష్ణారెడ్డి, పీఈటీ ఎస్.కె.రహీమ్ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ చాటి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
Also Read : షూ వివాదం.. ఇరాన్ అథ్లెట్ డిస్క్వాలిఫై
Follow Us On : WhatsApp

