నిజామాబాద్‌లో నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి శ్రీకారం

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad)నగరంలో నిర్మించనున్న నూతన గ్రంథాలయ భవనానికి టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రాజారెడ్డి, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా నూతన గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

విద్యార్థులు, యువతకు ఉపయోగపడే విధంగా గ్రంథాలయంలో ఆధునిక సౌకర్యాలు, నాణ్యమైన పుస్తకాలు, డిజిటల్ వనరులు అందుబాటులోకి తీసుకురావాలని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. పుస్తక పఠనం ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో అవసరమని ఆయన అన్నారు. పుస్తకాలు జ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు ఆలోచనా విధానాన్ని, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని తెలిపారు. ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి రావడంతో ప్రపంచం అరచేతిలోకి వచ్చిందని, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన విషయాలు నేటి పరిస్థితుల్లో మరింత ప్రాసంగికంగా కనిపిస్తున్నాయని అన్నారు.

సోషల్ మీడియా ప్రభావం యువతపై పెరుగుతున్న నేపథ్యంలో దాని వినియోగంలో విచక్షణ అవసరమని మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సూచించారు. సోషల్ మీడియాను కేవలం వినోదానికి పరిమితం చేయకుండా విద్య, విజ్ఞానం, నైపుణ్యాభివృద్ధికి ఉపయోగించుకోవాలని యువతకు సూచించారు. యువతకు గ్రంథాలయాల ప్రాధాన్యతపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా కళాశాల విద్యార్థులు గ్రంథాలయ సభ్యత్వం తీసుకుని పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు పోటీ పరీక్షలు, ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలకు సంబంధించిన సమాచారాన్ని గ్రంథాలయాల ద్వారా పొందేలా ప్రోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రంథాలయ నిర్వాహకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Also Read : ‘చీటింగ్’ ఆరోపణలకు చెక్.. వైడ్‌పై ఆకాశ్ చోప్రా క్లారిటీ!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>