బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉదయ్ నియామకం

కలం, సోన్: సోన్ మండలం పాక్‌పట్ల గ్రామానికి చెందిన పొల్కం ఉదయ్ (Polkam Uday)భారతీయ జనతా యువ మోర్చా (BJYM) నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో జిల్లా ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించినందుకు పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం చంద్రకాంత్, సోన్ మండల అధ్యక్షుడు మార గంగారెడ్డి, నాయకులు జుట్టు దినేష్, సాయిరెడ్డి, నర్సారెడ్డి, సన్నీ రెడ్డి, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>