శ్రీకాకుళంలో ఘోర ప్రమాదం: వరద నీటిలో కొట్టుకుపోయిన ఎమ్మెల్యే, కలెక్టర్!

కలం, వెబ్ డెస్క్ : శ్రీకాకుళం జిల్లాలో పడుతున్న భారీ వర్షం కారణంగా నదులు, వాగులు పొంగిపొర్లుతుండటంతో వరద (Srikakulam Floods) తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్లిన ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌(Koona Ravi Kumar)తో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితర అధికారులకు తృటిలో ప్రమాదం తప్పింది. క్షేత్రస్థాయిలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో ఒక్కసారిగా పెరిగిన వరద ఉధృతికి ఎమ్మెల్యే కూన రవికుమార్, కలెక్టర్, ఎస్పీ సహా పలువురు అధికారులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు.

అయితే వెంటనే అప్రమత్తమైన ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సహాయక బృందాలు రంగంలోకి దిగి, సమయస్ఫూర్తితో వ్యవహరించి వారందరినీ సురక్షితంగా కాపాడాయి. ఎమ్మెల్యే కూన రవికుమార్ (Koona Ravi Kumar) తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రాణాపాయం నుంచి బయటపడటంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, జిల్లా వ్యాప్తంగా వరద నీరు వేగంగా పెరుగుతుండటంతో ప్రజలు అనవసరంగా బయటకు రాకూడదని, వాగులు-వంకలు దాటేందుకు ప్రయత్నించవద్దని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

Also Read : గాంధీ జయంతి నుంచి దేశవ్యాప్తంగా సీజేపీ ఆందోళనలు..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>