తూప్రాన్ మున్సిపల్ ఆఫీస్ వద్ద ఎర్ర లేఖల కలకలం.. ఇద్దరు అరెస్ట్

కలం, మెదక్ బ్యూరో : మెదక్ జిల్లా తూప్రాన్‌లో తీవ్ర కలకలం రేపిన ఎర్ర కాగితాల (Tupran Red Paper) వ్యవహారంపై జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు.ఇన్స్టాగ్రామ్‌లో వ్యూస్, ఫాలోవర్స్ పెంచుకోవడానికి ఇద్దరు యువకులు చేసిన చిలిపి చేష్టలే తప్ప, దీని వెనుక ఎలాంటి మావోయిస్టుల హస్తం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

ఇటీవల తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం గేట్లపై గుర్తు తెలియని వ్యక్తులు ఎర్ర కాగితాలు (Tupran Red Paper) అంటించడంతో స్థానికంగా పెద్ద ఎత్తున కలకలం రేగింది. మావోయిస్టుల పేరిట ఇవి వెలిశాయనే ప్రచారంతో ప్రజలు, అధికారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా పోలీసులు ప్రత్యేక బృందాలతో సమగ్ర విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా తూప్రాన్ మండలం నాగులపల్లికి చెందిన బండ మందు, చింతకింది శ్రీధర్‌లు ఈ పని చేసినట్లు ఆధారాలతో సహా గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read : కాస్ట్లీ ఖైరతాబాద్.. ఖరీదైన వ్యవహారంగా మారనున్న బైపోల్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>