సాత్విక్-చిరాగ్‌కు షాక్.. తొలి రౌండ్‌లోనే ఔట్!

కలం, స్పోర్ట్స్​ : ఆసియా గేమ్స్‌లో భారత్‌కు బ్యాడ్మింటన్‌లో భారీ షాక్ తగిలింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి (Satwik – Chirag) పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు. థాయ్‌లాండ్‌కు చెందిన పక్కపాన్ టీరరత్సాకుల్, పీర్‌చాయ్ సుక్ఫున్ చేతిలో 21-12, 19-21, 14-21తో పరాజయం పాలయ్యారు. మ్యాచ్ గంటా 8 నిమిషాలు సాగింది. తొలి గేమ్‌లో సాత్విక్-చిరాగ్ పూర్తి ఆధిపత్యం చూపించారు. 20 నిమిషాల్లోనే 21-12తో గేమ్‌ను సొంతం చేసుకున్నారు. దీంతో మ్యాచ్‌ను త్వరగా ముగించేలా కనిపించారు.

అయితే రెండో గేమ్‌లో థాయ్ జోడీ పుంజుకుంది. 24 నిమిషాల పాటు సాగిన గేమ్‌లో 21-19తో విజయం సాధించింది. దీంతో మ్యాచ్ నిర్ణయాత్మక మూడో గేమ్‌కు వెళ్లింది. మూడో గేమ్‌లోనూ థాయ్ జోడీ అదే జోరు కొనసాగించింది. సాత్విక్-చిరాగ్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. 19 నిమిషాల్లో 21-14తో గేమ్‌ను గెలిచి మ్యాచ్‌ను ముగించింది. దీంతో గత ఆసియా గేమ్స్‌లో సాధించిన స్వర్ణాన్ని నిలబెట్టుకోవాలన్న సాత్విక్-చిరాగ్ ప్రయత్నం తొలి రౌండ్‌లోనే ముగిసింది. అంతకుముందు పురుషుల టీమ్ ఈవెంట్‌లో భారత్ కాంస్య పతకం సాధించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>