మహిళా భద్రతపై కరీంనగర్‌లో ఎస్‌ఎఫ్‌ఐ నిరసన

కలం, ​కరీంనగర్: దేశంలో చట్టాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా అమలులోకి వచ్చి మహిళలకు సరైన రక్షణ కల్పించాలని (Women Protection) భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) రాష్ట్ర కమిటీ సభ్యురాలు శ్రీరాముల సంజన డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మంకమ్మతోటలోని వాజేశ్వరి డిగ్రీ ఉమెన్స్ కళాశాలలో మహిళలు, బాలికలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సంజన మాట్లాడుతూ.. స్వతంత్ర భారతదేశంలో రోజురోజుకూ మహిళలకు భద్రత కరువవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా రక్షణ చట్టాలను పకడ్బందీగా అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ఇటీవల బీహార్‌లో మైనర్ బాలికపై దాడి, ఢిల్లీలో మైనర్ బాలిక అత్యాచారం, హత్య ఘటనలతో పాటు తెలంగాణలోని గోదావరిఖనిలో మహిళ హత్య ఘటనలు తీవ్ర కలవరం కలిగిస్తున్నాయన్నారు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “బేటీ బచావో.. బేటీ పడావో” నినాదం కేవలం ప్రచారానికే పరిమితమైందని, ఆచరణలో మహిళలకు రక్షణ కల్పించలేకపోతోందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి మహిళా రక్షణ చట్టాలపై క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలు, బాలికలకు పూర్తి భద్రత లభించే వరకు SFI పోరాటం (SFI Protest)ఆపేదిలేదని స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకురాళ్లు రమ్య, శృతి, శిరీష, స్వాతి, శ్రీజ, తేజ, తేజస్విని, చరణ్య తదితర విద్యార్థినులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>