ప్రశాంత వాతావరణంలో వినాయక ఉత్సవాలు జరపాలి: ఎస్పీ డాక్టర్ వినీత్

కలం, నారాయణపేట: నారాయణపేట (Narayanpet) జిల్లాలో శాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలను ముగించాలని ఎస్పీ డాక్టర్ వినీత్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మెయిన్ చౌక్ లో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమానికి ఎస్పీ డాక్టర్ వినీత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భరతమాత, వినాయకుని చిత్రపటానికి ప్రత్యేక పూజలను చేశారు.

సొంతూరులో వేడుకలకు హాజరైన భద్రాచలం ఐటీడీఏ పీఓ

నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన బి. రాహుల్ సివిల్స్ పరీక్షలో ప్రతిభ కనబరిచి 2020 బ్యాచ్ ఐఏఎస్ గా సెలెక్ట్ అయ్యారు. గతంలో ఖమ్మం, మంచిర్యాలలో పనిచేశారు. ప్రస్తుతం భద్రాచలం ఐటిడిఏ పిఓగా కొనసాగుతున్నారు. కాగ మొదటిసారి ఐఏఎస్ హోదాలో పదేళ్ల తర్వాత సొంతూరులో వినాయక నిమజ్జన ఉత్సవాలకు బి రాహుల్ ఐఏఎస్ హాజరు కావడం విశేషం. నారాయణపేట వినాయక ఉత్సవాలకు ఎంతో ప్రసిద్ధి అన్న ఆయన.. ప్రాచీన, ఇతిహాస , ఆధ్యాత్మిక అలంకరణలు నిమజ్జన ఉత్సవాల్లో ప్రత్యేకంగా నిలుస్తాయన్నారు. తన చిన్నతనంలో వినాయక ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొనే వాడినని, చాలా రోజుల తర్వాత తన పుట్టిన ఊరిలో నిమజ్జన ఉత్సవాల్లో స్వయంగా పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>