కలం, మక్తల్: గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వాడవాడల్లో కొలువై పూజలు అందుకుంటున్న గణనాథుడి కరుణాకటాక్షాలతో ప్రజల జీవితాల్లో నెలకొన్న విజ్ఞాలన్నీ తొలగిపోవాలని, ప్రజలు, రైతులు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని మక్తల్ (Makthal) మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పి. నరసింహ గౌడ్ అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని చందాపూర్ లో కొలువుదీరిన వినాయక మండపాలను గురువారం ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్చకులు, నిర్వాహకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో అశోక్ కుమార్ గౌడ్, బద్రి, రాము, అంజి, నరసింహ, శంకర్, కల్యాణి, రాజు, రవి, రామన్ గౌడ్, వెంకటేష్ గౌడ్, శ్యాం సుందర్ గౌడ్, రంజిత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

