నిర్మల్‌లో భూముల రీ సర్వేపై కలెక్టర్ కీలక ఆదేశాలు

కలం, నిర్మల్: జిల్లాలో కొనసాగుతున్న భూముల రీ సర్వే (Land Resurvey) ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో భూముల రీ సర్వేపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇప్పటివరకు పూర్తయిన రీ సర్వే వివరాలు, పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో అందుబాటులో ఉన్న 16 సర్వే యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ, 16 ప్రత్యేక బృందాలతో సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి బృందం సమన్వయంతో, నిర్దేశిత విధానాలను పాటిస్తూ సర్వే నిర్వహించాలని ఆదేశించారు.

భూమి యజమాని, సరిహద్దు భూముల రైతుల సమక్షంలో సర్వే చేపట్టి, ఎలాంటి వివాదాలకు తావులేకుండా పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సర్వే తేదీ, సమయాన్ని ముందుగానే సంబంధిత రైతులకు తెలియజేయాలని సూచించారు. గ్రామాల వారీగా సర్వే వివరాలను పకడ్బందీగా నమోదు చేసి, ఖచ్చితమైన మ్యాపులు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రీ సర్వేలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని సూచించారు. సమావేశంలో ఇంచార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, ఏ.డీ. ల్యాండ్ సర్వే రికార్డ్స్ విఠల్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>