సోన్ KGBVలో మోదీ 25 ఏళ్ల ప్రస్థానంపై చిత్రలేఖన పోటీలు

కలం, సోన్: దేశ ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ, సమర్పణ ప్రస్థానంపై సోన్ మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం (Soan KGBV) లో గురువారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖన పోటీ విద్యార్థుల్లోని సృజనాత్మకతకు అద్దం పట్టింది.

6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని.. దేశ అభివృద్ధి, అభివృద్ధి చెందిన భారత్‌, విద్య, సాంకేతికత, పర్యావరణ పరిరక్షణ, యువత పాత్ర, సామాజిక బాధ్యత వంటి అంశాలను తమ చిత్రాల్లో అద్భుతంగా ఆవిష్కరించారు. కుంచెతో గీసిన ప్రతి చిత్రం దేశ భవిష్యత్‌పై విద్యార్థుల ఆలోచనలకు ప్రతిబింబంగా నిలిచింది.

పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సరిగెల గంగన్న, బీజేపీ మండల అధ్యక్షుడు మార గంగారెడ్డి, సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>