కలం, వెబ్ డెస్క్ : నీట్ పేపర్ లీకేజీ ఘటనపై ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మరో భారీ ఉద్యమానికి పిలుపునిచ్చింది. గతంలో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టిన సీజేపీ.. ఈసారి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను లక్ష్యంగా చేసుకుంది.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) 48 గంటల్లోగా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఒకవేళ సీఈసీ రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని సీజేపీ (CJP) అధినేత అభిజీత్ దీప్కే (Abhijeet Dipke) అల్టిమేటం జారీ చేశారు. భారత ప్రజాస్వామ్యానికి సీఈసీ జ్ఞానేశ్ అతిపెద్ద ముప్పుగా మారారని ఆయన ఆరోపించారు. అవినీతికి పాల్పడుతున్న సీఈసీ తక్షణమే రాజీనామా చేయాలని దీప్కే డిమాండ్ చేశారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు తమ ఉద్యమాన్ని విరమించబోమని ఆయన స్పష్టం చేశారు.
Also Read: బల్మూరి వెంకట్‌పై NSUI స్టేట్ ప్రెసిడెంట్ ఫిర్యాదు!
Follow Us On : WhatsApp

