కలం, స్పోర్ట్స్ : సమర్‌కండ్ వేదికగా జరుగుతున్న చెస్ ఒలింపియాడ్ (Chess Olympiad) 7వ రౌండ్‌లో భారత జట్లు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. ఓపెన్ విభాగంలో ఇంగ్లండ్‌పై భారత్ 2.5-1.5 తేడాతో విజయం సాధించగా, మహిళల విభాగంలో జర్మనీపై 3.5-0.05 తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 6వ రౌండ్‌లో ఉజ్బెకిస్తాన్‌పై నిహాల్ సరిన్ వేగంగా ఆడి చేసిన తప్పిదం కారణంగా భారత్ ఓటమి పాలైంది.
విశ్రాంతి దినం తర్వాత జరిగిన 7వ రౌండ్‌లో భారత్ తిరిగి పుంజుకుంది. బోర్డుపై గుకేష్, రమేష్‌బాబు ప్రజ్ఞానంద తమ గేమ్‌లను గెలుచుకోవడంతో భారత్ విజయం ఖాయమైంది. అర్జున్ ఎరిగాసి తన గేమ్‌ను డ్రా చేసుకోగా, బోర్డు-3పై నిహాల్ సరిన్ ఇంగ్లండ్‌కు చెందిన ల్యూక్ మెక్‌షేన్ చేతిలో ఓడిపోయాడు. మారథాన్ లాంటి 88 ఎత్తుల పోరాటంలో నిహాల్‌కు పరాజయం తప్పలేదు.
మరోవైపు ఆతిథ్య ఉజ్బెకిస్తాన్ జట్టు చైనాపై 3-1 తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 7 రౌండ్లు పూర్తయ్యేసరికి ఉజ్బెకిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ముందంజలో ఉంది. నాలుగు రౌండ్లు మాత్రమే మిగిలి ఉండటంతో భారత్‌కు స్వర్ణ పతక అవకాశాలు కష్టంగా మారాయి. మహిళల విభాగంలో భారత్ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తోంది.
19 ఏళ్ల సవితా శ్రీ టోర్నీలో ఆడిన ఆరు గేమ్‌లలోనూ గెలిచి వరుస విజయాలను నమోదు చేసింది. జర్మనీకి చెందిన లారా షుల్జ్ పై 88వ ఎత్తులో విజయం సాధించి జట్టుకు కీలక పాయింట్ అందించింది. కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్ తమ గేమ్‌లలో గెలవగా, వైశాలి రమేష్‌బాబు గేమ్ డ్రాగా ముగిసింది.

