ఉప ఎన్నిక‌ల‌పై జీవ‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు!

క‌లం, వెబ్‌డెస్క్‌: రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన‌ ప్ర‌తి చోటా ఉప ఎన్నిక జ‌రుగుతుంద‌ని బీఆర్ఎస్ లీడ‌ర్ జీవ‌న్ రెడ్డి (Jeevan Reddy) అన్నారు. దానం నాగేంద‌ర్ వ్య‌వ‌హారంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై జీవ‌న్ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడారు. దానం నాగేంద‌ర్ అన‌వ‌స‌రంగా రేవంత్ రెడ్డి మాటలు విని సుప్రీం కోర్టుకు వెళ్లి బొక్క‌బోర్లా ప‌డ్డాడ‌న్నారు. దానం లాగానే పార్టీ ఫిరాయించిన ప్ర‌తి ఒక్క‌రిపై అన‌ర్హ‌త వేటు ప‌డుతుంద‌న్నారు. క‌నీసం హైకోర్టు తీర్పును గౌర‌వించి సుప్రీం కోర్టుకు వెళ్ల‌కుండా ఉంటే బాగుండేద‌న్నారు. ఇక దానం నాగేందర్ పని అయిపోయింద‌న‌ని చెప్పారు. ఆయ‌న ప‌రిస్థితి నా ఘర్‌కా నా ఘాట్‌కా అన్నట్టుగా త‌యారైంద‌ని ఎద్దేవా చేశారు.

దానం నాగేంద‌ర్‌కు ఉప ఎన్నిక‌లో కొట్లాడే ధైర్యం ఉండి ఉంటే సుప్రీం కోర్టుకు వెళ్లేవాడు కాద‌ని జీవ‌న్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఉప ఎన్నిక‌లు జ‌రిగే ప‌ది స్థానాల్లో క‌ష్ట‌ప‌డి ప‌ని చేసి త‌మ అభ్య‌ర్థుల‌ను గెలిపించుకుంటామ‌ని చెప్పారు. త‌ప్ప‌కుండా ప్ర‌తి చోటా బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>