ఎస్సై వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. నుజ్జునుజ్జైన పోలీస్ కారు!

​కలం, ఖమ్మం బ్యూరో : వినాయక నిమజ్జన బందోబస్తు విధులు ముగించుకుని తిరిగొస్తున్న ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం ఎస్సై వాహనాన్ని అర్ధరాత్రి వేళ ఓ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఎస్సై కూచిపూడి జగదీష్‌తో (Tirumalayapalem SI Jagadish) పాటు ఆయన డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ తలకు బలమైన గాయం కాగా, క్షతగాత్రులను తక్షణమే ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.

​మండలంలోని పలు గ్రామాల్లో గణేష్ నిమజ్జన వేడుకల పర్యవేక్షణ ముగించుకుని పిండిప్రోలు నుంచి తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్‌కు ఎస్సై జగదీష్ బయలుదేరారు. కాకరవాయి గ్రామానికి చెందిన డ్రైవర్ కొత్తపల్లి రాకేష్‌తో కలిసి పోలీస్ వాహనంలో ప్రయాణిస్తుండగా, బుధవారం అర్ధరాత్రి సుమారు 1 గంట సమయంలో భవాని హోటల్ సమీపానికి చేరుకోగానే ఎదురుగా వస్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాద ధాటికి పోలీస్ వాహనం తీవ్రంగా దెబ్బతిని నుజ్జునుజ్జయ్యింది.

​ఈ ఘటనలో డ్రైవర్ కొత్తపల్లి రాకేష్ తలకు బలమైన గాయం కాగా, ఎస్సై జగదీష్‌కూ తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన వెంటనే స్థానికులు, తోటి పోలీసులు స్పందించి క్షతగాత్రులను ముందుగా తిరుమలాయపాలెం ఆసుపత్రికి చేర్చారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం వారిని ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు, లారీ వివరాలపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>