‘మీ ఇంటికే మీ సేవ’.. డోర్ డెలివరీ సర్వీసెస్ ప్రారంభం

కలం, తెలంగాణ బ్యూరో: ‘గుడ్ గవర్నెన్స్’కు టెక్నాలజీని జోడించి ‘డిజిటల్ గవర్నెన్స్’లో తెలంగాణను ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలన్నదే తమ సంకల్పమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పౌర సేవలను నేరుగా ఇంటి దగ్గరికే చేర్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌ బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో ‘మీ సేవ’ డోర్ డెలివరీ సర్వీసులను (MeeSeva Door Delivery) మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “పాలనలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నాం. పాలనకు టెక్నాలజీని జోడించి పారదర్శకత, జవాబుదారీతనం, సుపరిపాలనకు పెద్దపీట వేస్తున్నాం. ప్రభుత్వ యంత్రాంగమే నేరుగా ప్రజల దగ్గరికి వెళ్లేలా ‘డోర్ డెలివరీ సర్వీసెస్’కు శ్రీకారం చుట్టాం. 1100 టోల్ ఫ్రీ నెంబర్ లేదా ‘మీ సేవ’ పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటే జనన/మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆదాయ, కుల, నివాస సర్టిఫికెట్లు, ఈసీ కాపీలు, పోలీసు శాఖ సేవలు, ఐజీఆర్‌ఎస్ రిజిస్ట్రేషన్లు తదితర సేవలను ఇంటి దగ్గరే అందిస్తాం. ఇందుకోసం 70 మందికి పైగా మీ సేవ ఏజెంట్లు, మీ సేవ వీఎల్ఈలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. తొలిదశలో ‘క్యూర్’ ప్రాంతాల్లో ఈ సేవలను ప్రారంభిస్తున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాం” అని వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>