కలం, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు (Harish Rao) నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరుకానున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువు నష్టం కేసులో మధ్యాహ్నం 3 గంటలకు హరీష్ రావు కోర్టుకు చేరుకుని తన స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. ఇటీవల తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హరీష్ రావు తరఫు న్యాయవాది ఈ పరువు నష్టం దావా వేసిన విషయం విదితమే.
Also Read : డిండి ప్రాజెక్టుపై పాలమూరు జేఏసీ పోరుబాట
Follow Us On : WhatsApp

