బస్సులో మంటలు: తొమ్మిది మంది సజీవదహనం

కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా (Greater Noida) సమీపంలో ఉన్న యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై విషాదం చోటుచేసుకుంది. నోయిడా నుంచి మహోబా వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ ఏసీ స్లీపర్ బస్సులో అకస్మాత్తుగా భారీగా మంటలు (Bus Fire) చెలరేగాయి. జెవర్ కార్గో విమానాశ్రయం సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. మంటలు క్షణాల్లోనే బస్సు మొత్తానికి విస్తరించడంతో దాదాపు తొమ్మిది మంది ప్రయాణికులు సజీవదహనమై ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాదం సమయంలో బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సులో ఒక్కసారిగా కేకలు, గందరగోళం నెలకొన్నాయి. ప్రమాదాన్ని గమనించిన పలువురు ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకోవడానికి కిటికీల నుంచి బయటకు దూకేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని సుమారు 45 నిమిషాల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

ఈ బస్సు రాజ్‌కల్పనా ట్రావెల్స్‌కు చెందినదిగా గుర్తించారు. ప్రమాద స్థలంలో పోలీసు, సహాయక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. మృతి చెందిన వారి వివరాలు, గాయపడిన ప్రయాణికుల గుర్తింపు ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

Also Read : బోరు ఎండింది.. నల్లా నీరే దిక్కైంది..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>