కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ నగరంలోని వివిధ గణేష్ మండపాలను సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) పరిశీలించారు. అక్కడ జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. అద్భుతంగా నృత్యం చేసిన చిన్నారులను అభినందించి వారికి నిర్వాహకులతో కలిసి జ్ఞాపికలు బహూకరించారు. ఈ సందర్భంగా మండపాల వద్ద భక్తులు నిర్వాహకులతో మాట్లాడి నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంతో పాటు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సహకరించాలని సూచించారు. సీపీ వెంట సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

