భద్రాచలంలో గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టు

కలం, భద్రాచలం :  ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి నుంచి తెలంగాణలోని ఘట్‌కేసర్‌కు ద్విచక్ర వాహనంపై అక్రమంగా తరలిస్తున్న 3.5 కేజీల ఎండు గంజాయిని భద్రాచలం (Bhadrachalam) వద్ద ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఇసుక రీచ్ సమీపంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో స్మగ్లింగ్ గుట్టురట్టైంది. రూ.2.80 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకుని నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు నిందితులను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా డిప్యూటీ కమిషనర్ వి. సోమిరెడ్డి, ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్. కిషన్ ఆదేశాల మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ ఎన్. నరేందర్ రెడ్డి పర్యవేక్షణలో ఎస్‌ఐ సిహెచ్. శ్రీహరి రావు సిబ్బందితో కలిసి భద్రాచలం ఇసుక రీచ్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన యమహా బైక్‌ను తనిఖీ చేయగా 3.5 కేజీల ఎండు గంజాయి లభ్యమైంది.

విచారణలో నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన మస్క్ మున్నా (A1), జున్జు శ్రీనివాస్ (A2) కలిసి మారేడుమిల్లి నుంచి ఘట్‌కేసర్‌కు బైక్‌పై గంజాయిని తరలిస్తున్నట్లు వెల్లడైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, గంజాయితో పాటు యమహా ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు మొత్తం విలువ సుమారు రూ.2,80,000 ఉంటుందని అధికారులు తెలిపారు. అనంతరం నిందితులను, జప్తు చేసిన సొత్తును తదుపరి చట్టపరమైన విచారణ నిమిత్తం భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు. తనిఖీల్లో ట్రైనింగ్ ఎస్‌ఐలు సందీప్, పృథ్వీ, కానిస్టేబుళ్లు వీరబాబు, ప్రసన్న కుమార్, డ్రైవర్ సాయి పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>