భారీ వర్షాల వేళ అలర్ట్​.. ఖమ్మంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

​కలం, ఖమ్మం బ్యూరో : అల్పపీడన ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో ఖమ్మం (Khammam Heavy Rains) జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు టోల్‌ఫ్రీ నంబర్ 1077 లేదా సెల్ నంబర్ 9063211298 ను సంప్రదించాలని, సమాచారం అందిన వెంటనే అధికారులు తక్షణ సహాయక చర్యలు చేపడతారని వెల్లడించారు.

​జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్టుల్లో నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను ముందుగానే గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, రహదారులపై వరద నీరు ప్రవహిస్తున్న చోట రాకపోకలను పర్యవేక్షించాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్, నీటిపారుదల, వైద్య, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. పొంగిపొర్లుతున్న వాగులు, కాలువలను దాటే ప్రయత్నం చేయవద్దని, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉంటూ ప్రజలు జాగ్రత్తలు వహించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>