వినాయక మండపాల్లో చల్లా వంశీచందర్ రెడ్డి ప్రత్యేక పూజలు

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: ప్రజలంతా సుఖసంతోషాలతో జీవిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, అందుకు విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని సీడబ్ల్యూసీ సభ్యులు చల్లా వంశీచందర్ రెడ్డి (Challa Vamshi Chand Reddy) ఆకాంక్షించారు. బుధవారం మహబూబ్‌నగర్ (Mahabubnagar) పట్టణంలోని పలు వినాయక మండపాలను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎ. సంజీవ్ ముదిరాజ్‌తో కలిసి చల్లా వంశీచందర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆర్యవైశ్య, బ్రాహ్మణవాడి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. జిల్లాలో శాంతి, సౌభ్రాతృత్వం, అభివృద్ధి మరింతగా కొనసాగాలని, అందుకు గణనాథుడి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. అనంతరం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి, డీసీసీ జనరల్ సెక్రటరీ ఎం.ఏ. కలీం, మైనారిటీ సెల్ అధ్యక్షులు ఫయాజ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>