ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం: వంశీ చందర్ రెడ్డి

కలం, నారాయణ పేట: కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం లభిస్తుందని సీడబ్ల్యూసీ సభ్యుడు, డాక్టర్ చల్లా వంశీ చందర్ రెడ్డి (Challa Vamshi Chand Reddy) అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో పార్టీ కార్యవర్గం, మండల, పట్టణ అధ్యక్షుల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా వంశీ చందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా చేస్తున్న మత రాజకీయాలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టి ప్రజలకు వాస్తవాలను వివరించాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలను అమలు చేస్తోందన్నారు. రాష్ట్రం, కేంద్రంలో పార్టీని బలోపేతం చేసి రాహుల్ గాంధీని ప్రధానిగా చేసేందుకు సమష్టిగా కృషి చేయాలని కోరారు.

నూతన సభ్యులకు నియామక పత్రాలు..

డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పార్టీ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో విస్తృతంగా నిర్వహించి ప్రజలతో నిరంతరం మమేకం కావాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు చేరేలా కార్యకర్తలు చొరవ చూపాలని కోరారు. పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభించేలా నాయకత్వం కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులను సన్మానించి, వారికి నియామక పత్రాలను అందజేశారు.

అలాంటి వారిని తొలగించాలి..

పార్టీ నిర్వహించే సమావేశాలకు కారణం లేకుండా మూడు సార్లు గైర్హాజరు అయితే నోటీసు ఇచ్చి కమిటీ నుంచి తొలగించాలని సీడబ్ల్యూసీ సభ్యుడు, డాక్టర్ చల్లా వంశీ చందర్ రెడ్డి సూచించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఎమ్మెల్యే, మంత్రులతో సమన్వయంతో పనిచేసేలా పీఏసీ సభ్యులు చొరవ తీసుకోవాలని సూచించారు. ప్రతి నెలా రెండో శనివారం తప్పనిసరిగా జిల్లా, మండల, గ్రామ స్థాయిలో పీఏసీ సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్ల. విజయ్ కుమార్, వాకిటి మానస, నరేందర్, సదా శివారెడ్డి, ఎండీ సలీం, ఎండీ గౌస్, గొల్ల కృష్ణయ్య, ప్రసన్న రెడ్డి, గాజుల శివకుమార్, వెంకటయ్య, శరణ్ నాయక్, బోయ శరణప్ప, రాజేశ్వర్ గౌడ్, మనోహర్ గౌడ్, కోట్ల రవీందర్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, సుధాకర్, విద్యాసాగర్, పళ్ళ అనిల్, అన్న కిష్టప్ప, రఘువర్ధన్ రెడ్డి, రఘుపతి రెడ్డి పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>