నిర్వాసితులకు మెరుగైన వసతులే లక్ష్యం: కుంభం అనిల్

కలం, భువనగిరి: బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితుల కోసం ఏర్పాటు చేసిన బీఎన్‌ తిమ్మాపురం ఆర్అండ్ఆర్ కాలనీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Kumbam Anil Kumar Reddy) స్పష్టం చేశారు. బుధవారం బీఎన్ తిమ్మాపురం ఆర్అండ్ఆర్ కాలనీలో రూ.45 కోట్ల భారీ వ్యయంతో నూతనంగా చేపట్టనున్న పలు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై, భూమిపూజ నిర్వహించారు. అనంతరం పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ మాట్లాడుతూ.. నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం గుర్తించిందని, కాలనీవాసులకు మెరుగైన వసతులు అందుబాటులోకి తీసుకురావడమే ధ్యేయంగా ఈ నిధులను కేటాయించినట్లు తెలిపారు. ఆర్అండ్ఆర్ కాలనీలో నాణ్యమైన రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రక్షిత తాగునీరు, విద్యుత్ సరఫరా, మెరుగైన పారిశుద్ధ్యంతో పాటు పాఠశాలల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులు వేగవంతంగా పూర్తయ్యేలా చూస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి-రవికుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తి, పీఏసీఎస్ చైర్మన్ పక్కిరి కొండల్ రెడ్డి, మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ పోతంశెట్టి మంజుల-వెంకటేశ్వర్లు, స్థానిక సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే భువనగిరి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కూర వెంకటేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లంల జంగయ్య యాదవ్, స్థానిక కౌన్సిలర్ తుమ్మెటి పాండు, ఎస్సీ-ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు రావుల నందు, ఉప సర్పంచ్ శ్రీశైలం, మాజీ సర్పంచ్ రాజు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోత్నాక్ ప్రమోద్, ఎడ్ల సతిరెడ్డి, కనుకుంట్ల బాబురావు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>