కొత్తగూడెం సెంట్రల్ లైటింగ్ నిర్వహణపై కూనంనేని ఆగ్రహం

​కలం, ఖమ్మం బ్యూరో : ఒకవైపు ప్రధాన రహదారుల్లో అంధకారం అలుముకుని ప్రయాణికులు భయాందోళన చెందుతుంటే, బాధ్యత వహించాల్సిన అధికార యంత్రాంగం మాత్రం నిద్ర మత్తులో జోగుతోంది. నియోజకవర్గంలో సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ తీవ్ర అస్తవ్యస్తంగా మారడం, అధికారుల నిర్లక్ష్య వైఖరిపై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారుల తీరుపై నిప్పులు చెరిగారు.

​రహదారుల డివైడర్లపై ఏర్పాటు చేసిన సెంట్రల్ లైట్లు వెలగకపోవడంతో రాత్రివేళల్లో రోడ్లన్నీ చీకటిమయంగా మారుతున్నాయని, దీనివల్ల నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశమున్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదని ఎమ్మెల్యే (MLA Kunamneni) స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎక్కడెక్కడ లైట్లు వెలగడం లేదో వెంటనే గుర్తించి, యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి నిర్దేశిత గడువులోగా రహదారులపై వెలుగులు నింపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, కార్పొరేషన్ కమిషనర్ సుజాత, డీపీఓ అనూష, ఎంపీడీఓలు సుభాషిణి, సుస్మిత తదితరులు పాల్గొన్నారు.

Also Read : ఇన్‌ఫ్లుయెన్స‌ర్ల‌కు ఏపీ స‌ర్కార్ గుడ్ న్యూస్‌!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>