అతను ఎక్కడున్నాడో దేవుడికే తెలియాలి: జగన్

కలం, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ఆరోపించారు. విజయవాడ నగరం నడిబొడ్డున ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి, స్టేషన్‌లోనే హత్య చేశారంటూ గాదె సాయికృష్ణ కేసును పరోక్షంగా ప్రస్తావించారు. ఆ వ్యక్తి మృతదేహం ఇంతవరకు కనిపించడం లేదని.. అసలు అతడు ఎక్కడున్నాడో దేవుడికే తెలియాలన్నారు. సుప్రీం కోర్టు స్వయంగా జోక్యం చేసుకోవడంతో డీజీపీ, పోలీస్ కమిషనర్ సహా పలువురిపై కేసులు నమోదు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. మరో ఘటనలో పోలీసుల అక్రమ వ్యవహారాలకు సహకరించడం లేదని ఒక యువకుడిని వేధిస్తే.. అతడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు.

వాళ్లు ఉపాధ్యాయులే కాదు..

మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ సోమవారం వైసీపీ చేసిన ఆందోళనలను అణచివేసేందుకు చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరించారని జగన్ విమర్శించారు. శాప్ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన చేసేందుకు పోలీస్ కమిషనర్ అనుమతి కోరామని.. సరిగ్గా అదే రోజు చంద్రబాబు ప్రభుత్వం ఉపాధ్యాయుల నిరసన అంటూ డ్రామా చేసిందన్నారు. అందులో పాల్గొన్నవారు నిజమైన టీచర్లు కాదని.. టీడీపీ కార్యకర్తలు అన్నారు. దేశ చరిత్రలో పరీక్ష లేకుండానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ సర్టిఫికేట్లు, జీవోల ద్వారా విద్యా శాఖ మంత్రిగా లోకేశ్ అక్రమాలకు అవకాశం కల్పించారని ఆరోపించారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>