భారీ వ‌ర్షం.. పెచ్చులు ఊడిన చార్మినార్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: హైద‌రాబాద్‌లో కురిసిన భారీ వ‌ర్షాల‌ (Hyderabad Rains)కు పాత‌బ‌స్తీలోని పురాత‌న క‌ట్ట‌డం చార్మినార్ (Charminar) స్వ‌ల్పంగా దెబ్బ‌తిన్న‌ది. దీంతో చార్మినార్ పెచ్చులు ఊడి కింద‌ప‌డ్డాయి. అయితే ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే చార్మినార్ భ‌ద్ర‌తా సిబ్బంది అక్క‌డికి చేరుకొని కింద‌ప‌డిన శిథిలాల‌ను తొలగించారు. లాడ్ బ‌జార్ వైపు ఉన్న భాగంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. సుమారు అర‌గంట పాటు ఏక‌ధాటిగా వాన కుర‌వ‌డంతోనే పెచ్చులు ఊడిన‌ట్లు తెలుస్తోంది.

పెచ్చులు ఊడిన ప్రాంతం కిందకు ప‌ర్యాట‌కులు రాకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. కాగా, 430 ఏళ్ల‌కు పైగా చ‌రిత్ర క‌లిగిన చార్మినార్‌(Charminar)ను చూసేందుకు రోజూ వేలాది మంది ప‌ర్యాట‌కులు వ‌స్తూ ఉంటారు. దీంతో ఆ ప్రాంతం ఎప్పుడూ సంద‌డిగా ఉంటుంది. అలాంటి ర‌ద్దీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ప్ర‌మాదం తీవ్ర భ‌యాందోళ‌న క‌లిగిస్తోంది. ప‌ర్యాట‌కుల భ‌ద్ర‌త దృష్ట్యా అధికారులు చార్మినార్‌ను ప‌రిశీలిస్తున్నారు. చార్మినార్‌కు ఎంత మేర‌కు న‌ష్టం జ‌రిగింద‌న్న దానిపై త్వ‌ర‌లో స్ప‌ష్ట‌త రానున్న‌ది.

Also Read : తెలంగాణ ఈగల్ ఫోర్స్ దేశానికే ఆదర్శం: సీఎం రేవంత్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>