టీవీ9 రిపోర్టర్ టికే రమేష్ మృతి

కలం, ​సుల్తానాబాద్: పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్‌కి చెందిన ప్రముఖ విలేకరి, టీవీ9 రిపోర్టర్ (TV9 Reporter) టికే రమేష్ (45) కొద్దిసేపటి క్రితం హార్ట్ స్ట్రోక్ (గుండెపోటు)తో అకస్మాత్తుగా మృతి చెందారు. ​గత 20 ఏళ్లుగా సుల్తానాబాద్‌లో విలేకరిగా, పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న రమేష్ మరణ వార్త స్థానిక విలేకరులను, ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతి పట్ల పలువురు విలేకరులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్యే విజయరమణారావు నివాళులు

ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సుల్తానాబాద్‌లోని టీ.కే రమేష్ నివాసానికి వెళ్లి వారి ప్రార్థివ దేహానికి పూలమాల వేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి సంతాపన్ని తెలిపి వారికి అన్నివిధాలుగా అండగా ఉంటామని మనోధైర్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్, మార్కెట్ చైర్మన్, కౌన్సిలర్లు, మీడియా మిత్రులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>